ఈతరం భారతం కామారెడ్డి ఆగస్టు 27 :భారీ వర్షాల నేపథ్యంలో స్వయంగా సహాయక చర్యలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్పీ. నర్వ అన్నాసాగర్ గ్రామాల మధ్యన రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడముతో వరద నీటితో చిక్కుకున్న 7 గురిని కాపాడే సహాయక చర్యలు, ఫోన్ లో మాట్లాడి బాధితులకు ధైర్యం తెల్పిన యస్పి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్ బృందం.. కామారెడ్డిలో ఏడు మండలాలు పూర్తిగా వరదతో నిండిపోయింది. జనజీవనం స్తంభించిందని పేర్కొంటున్నారు. గంట గంటకు పెరుగుతున్న నీటి ప్రభావం భారీ వరదలతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎల్లారెడ్డి ప్రాంతంలో వాగులు చెబుతున్న 14 మంది జంగంపల్లి దగ్గర కుంటలోకి దూసుకెళ్లిన కారు, మాచారెడ్డి రాజంపేట దోమకొండ బిక్కనూరు మండలాల్లో భారీగా నీట మునిగిన పంట పొలాలు..














