కామారెడ్డి జనవరి 18 (eetarambharatamnews);’ఒక మంచి ఆలోచన లక్షలాదిమందిని కదిలిస్తుంది. లక్షలాదిమందిలో కదలిక ఒక సమాజాన్ని కబళిస్తుంది’ అనే వివేకానందుని సిద్ధాంతాన్ని నేటి యువత పాటిస్తుంది. ” ఒక మంచి ఆలోచన కలిగిన ఒక వ్యక్తి ఒక సమూహమై, జన ప్రవాహమై సేవా మార్గంలో పయనిస్తున్నారు. ‘బలమే జీవితం. దౌర్బల్యమే మరణం’ అన్న మహనీయుడు మాటలను గుర్తుతెచ్చుకొని వివేకానందుడు మాట్లాడిన ప్రతి మాటను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. నేటి యువతరం నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు జీవత్వముల ఉండకండి, కాలయాపన పనికిరాదు, శ్రమించడం మొదలుపెడితే అనంత శక్తి మీలో జాగ్రత్తమౌతున్నట్లు మీకు అనుభూతి కలుగుతుంది అన్న వివేకానందుడి సూక్తి నేటి యువతను నిద్రపోనివ్వడం లేదు, ఏదో చేయాలి ఏదో చేయాలి అనే తపన సేవా కార్యక్రమములకు బీజం వేస్తుంది. నేటి ప్రపంచంలో యువత పేడదారిన పడుతూ తమ విలువలను కోల్పోతూ చక్కటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తరుణంలో మేమున్నామంటూ సమాజ సేవకు సిద్ధం అంటూ ముందుకొచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆరోగ్య జ్యోతి, తను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమాజానికి ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో 2018లో ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఒక ఉన్నత లక్ష్యాలతో సమాజ సేవకు మేము సైతం అంటూ ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనవరి 12 యువజన దినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువ కెరటం మన ఆరోగ్య జ్యోతి.
స్వచ్ఛంధ రక్తదాన శిబిరాలు:
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సుమారు 200 యూనిట్లను సేకరించి బోధన్, బాన్సువాడ, నిజామాబాద్లలో గల ప్రభుత్వ రక్త నిధి కేంద్రాల సహకారముతో నిర్వహించడమే కాకుండా ప్రమాదాలు గురైన వారు, అత్యవసర శాస్త్ర చికిత్సలు చేసుకుంటున్న వారు, రక్తహీనతతో గురి అయ్యి వారి స్వస్థతకు అవసరమైన మేరకు రక్త నిల్వలు ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలలో ఉండాలని ఉద్దేశ్యముతో పేదలకు, అభాగ్యులకు చేయూతనివ్వాలని ఆశయంతో సేవలందిస్తున్నటువంటి ఆరోగ్య చారిటబుల్ ట్రస్ట్.
ఉచిత అంబులెన్స్ సర్వీస్:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బోధన పట్టణం నుండి నిజామాబాద్ పట్టణముకు గాని, హైదరాబాదుకు గాని అత్యవసర రోగుల చికిత్స నిమిత్తము నిరుపేదలు, అభాగ్యులను బోధన పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పెద్ద ఆసుపత్రులకు పంపించినప్పుడు వారిని ఉచితముగా ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ద్వారా వారిని ఆ ప్రదేశంలోనికి దించి ఆ నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలు ప్రశంసనీయమైనవి.
క్యాన్సర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమము:
మహిళలకు క్యాన్సర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రజలను చైతన్య పరచటంలో కీలక పాత్ర వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామములోనూ డాక్రా గ్రూప్ మహిళలకు క్యాన్సర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహించి వాళ్లు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలపై మరియు సూచనలను ఇస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ 19 సమయంలో సేవలు:
భారతదేశంలో మొదటి విడత కోవిడ్-19 కాలంలో వైద్య రంగానికి సవాళ్లు విసురుతున్న రోజులలో తనదైన శైలిలో కోవిడ్-19 కి గురై, బంధువులకు దూరమై, భయాందోళనలతో బాధపడుతున్న నిస్సహాయులైన వారికి నేను ఉన్నాను అనే ధైర్యాన్ని కల్పిస్తూ వైద్యుల సలహా మేరకు చికిత్స తో పాటు సపరిచర్యలు చేస్తూ ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించిన పుణ్యాత్మురాలు, పేదలకు ఆకలిని తీర్చేందుకు 45 రోజులపాటు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్ ను ఆర్గనైజ్ చేసిన మాతృమూర్తి. ఆమె సొంత ఖర్చుతో పారిశుద్ధ్య కార్మికులకు కావలసిన మాస్కులను, సోపులను, సానిటైజర్ లను, దోమతెరలను అందజేసి పారిశుద్ధ్య కార్మికులలోనే పారిశుద్ధ్యని పెంపొందించిన పుణ్యాత్మురాలు ఆరోగ్య జ్యోతి.
గ్రామాలలో ఉచిత వైద్య శిబిరం:
గ్రామంలో అనేక మంది పేద ప్రజలు చేతిలో చిల్లికవ్వలేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నెలకి ఒకటి చొప్పున 12 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఇప్పటికి సుమారు 25 వేల మందికి పైగా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వీటితోపాటు ముఖ్యంగా గిరిజన తండాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు:
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేందుకుగాను ప్రముఖ వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలతో పాటు వైద్యం అందించి విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా దోహదపడింది. అందులో భాగంగానే పాఠశాల విద్యార్థులకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్య పరచడంలో ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ తీవ్ర కృషి చేయడం జరుగుతుంది.
మూగజీవాల పరిరక్షణ బాధ్యత:
మూగజీవాల పరిరక్షణలో భాగంగా గ్రామంలో వింత రోగాల బారిన పడిన గొర్రెలు, మేకలు ఇతర జంతువులను కాపాడేందుకుగాను పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 1500కు పైగా జీవాలకు సొంత ఖర్చులతో వ్యాక్సిన్లు అందించడం జరిగింది. అలాగే పశువులకు గాలి కుంటవ్యాధి సోకి నడవలేని స్థితిలో మృత్యువాత పడుతున్న దశలో స్థానిక పశు వైద్యులు చేత ఉచిత చికిత్సలు అందించే కార్యక్రమం తీసుకున్నారు.
నిత్య నూతన ప్రోత్సాహాన్ని నింపిన కొన్ని అవార్డులు:
ది నేషనల్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు 2023ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా బెంగుళూరులో అందుకోవడం జరిగింది. కోవిడ్-19 లో చేసిన సేవలకు గాను తెలంగాణ గవర్నర్ అవార్డును ఆరోగ్య జ్యోతి అందుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును అందుకోవటం జరిగింది. పలు స్వచ్ఛంద సంస్థల చేతుల మీదుగా అవార్డులు రివార్డులను ఆరోగ్య జ్యోతి అందుకున్నారు.














