ఈతరం భారతం పాలమూరు 16.01.25 : యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ తమిళనాడు లో జరుగుతున్న సౌత్ జోన్ అండ్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీకి మధ్య జరిగిన క్రికెట్ పోటీలలో పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల జట్టు రెండవ మ్యాచ్లో విజయం సాధించింది. ఇందులో యూనివర్సిటీ జట్టు సభ్యుడు అబ్దుల్ రఫీ 62 పరుగులు 48 బంతులు, డేవిడ్ 47 రన్స్ 27 బంతులు సాధించి ఈ విజయంలో భాగస్వామ్యం అయ్యారు. అలాగే డేవిడ్ 3 వికెట్లు మూకిత్ రెండు వికెట్లు తీసుకున్నారు .ఈ మ్యాచ్లో 68 రన్స్ తేడాతో ప్రత్యర్థి జట్టు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పై గెలుపొందారు. డేవిడ్ క్రిపాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు .ఈ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయంలో కీలక పాత్ర పోషించిన పాలమూరు యూనివర్సిటీ క్రీడా ఆణిముత్యం అబ్దుల్ రఫీ వ్యక్తిగత స్కోరు 62 సాధించిన సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్, రిజిస్టార్ ప్రొఫెసర్ డి చెన్నప్ప, ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డా. వై శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు
