నారాయణపేట,నవంబర్ 20, (ఈతరం భారతం ): నారాయణ పేట జిల్లాలోని మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనం వికటించి 100 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురికావడం జరిగింది. బుధవారం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక్కొక్క విద్యార్థులు విరోచనాలకు గురికావడంతో తమ తమ తల్లిదండ్రులకుతెలిపారు.దీంతో పాఠశాలకు హడావిడిన తల్లిదండ్రులు చేరుకోవడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు.తమ పిల్లలనువైద్యం అందించేందుకు మక్తల్ పట్టణానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు నారాయణపేట జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు
