మక్తల్, నవంబర్ 25(ఈతరం ఇండియా న్యూ స్); సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అని స్పోర్ట్స్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మక్తల్ నియోజకవర్గము ఆత్మకూరు మండల నికి సంబంధించి మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరుమండలంలోని మోట్లంపల్లి, గుంటిపల్లి, దేవరపల్లి, మేడపల్లి .. గ్రామ ముఖ్య నాయకులతో సమావేశం అయి న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గ్రామాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సమావేశలలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ రైతు బంధు,రైతు భీమా లాంటి సంక్షేమ పథకాలతో.. రైతు మోములో ఆనందం చూసిన ఘనత కెసిఆర్ గారిదని ఆయన వివరించారు.గురుకులాలతో సబ్బండ వర్గాలకు పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యానందిస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందని నేడు అన్ని వర్గాల అభివృద్ధికి అండగా నిలబడ్డ నాయకుడు కేసిఆర్ అని ఆయన తెలిపారు.24గంటల కరెంట్ ఇచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు కేసిఆర్ అని ఆయన పొగిడారు.కాంగ్రెస్ అధికారం లో ఉన్న..కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్ రాష్టాలలో 24గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.దేశంలోనే 450సంక్షేమ పథకాలు అందించిన ఘనత కెసిఆర్ గారిదని జరిగిన అభివృద్ధి నీ, నూతన మ్యాని ఫెస్టో నీ.. ఉదృతంగా ముందుకి తీసుకెళ్లాలని అయన కోరారు.ఎన్నికల తేదీ వరకు అందరూ ఏకతాటి మీద నిలబడి విశ్రమించక శ్రమించాలి.ఈ సందర్బంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఎన్నికల ప్రచార సరళిపై,గ్రామ సమస్యలపై సమీక్షించారు.కెసిఆర్ గారి చేసిన సంక్షేమాన్ని గడప గడపకి వివరించాలని, బిఆర్ఎస్ పార్టీ, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపె లక్ష్యం గా పనిచేయాలని డాక్టర్ ఆంజనేయ గౌడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు
















