EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రం లో నీటి సిరులు పక్కన కర్ణాటకలో కన్నీటి వరదలు

 

మక్తల్ నవంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్);మన రాష్ట్రంలో నీటి సిరులు..పక్కనే కర్ణాటకలో కన్నీటి వరదలు పారుతున్నాయని మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.. ఆదివారం మక్తల్ నియోజకవర్గం “కృష్ణ మండల బీఆర్ఎస్ పార్టీ బూత్, వంద ఓట్ల ఇంచార్జ్ లకు వర్క్ షాప్ లో పాల్గొన్నారు.ఈ సమావేశంలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ..మక్తల్ కరెంట్ వెలుగులు.. కర్ణాటక లో కటిక చీకట్లు కమ్ముకున్నయన్నారు. కరెంటు కావాలంటే బిఆర్ఎస్ కి ఓటు వేయాలి.. కరెంట్ పొవాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలన్నారు. సాగు, కరెంటు కష్టాలు తీర్చి.. రైతు కు అండగా నిలిచిన కెసిఆర్ అని,బిఆర్ఎస్ పార్టీకి కులం, మతం లేదు.. బిఆర్ఎస్ తత్వం మానవత్వం మన్నారు.తెలంగాణ లాంటి పథకాలు..కాంగ్రెస్ ఏలుబడి ఉన్న రాజస్థాన్, చత్తిస్ ఘడ్ లలో ఉన్నాయా? 73లక్షల మంది రైతులకు 85వేల కోట్లు అందించి.. రైతులకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వంమని,రైతు కుటుంబం లో ఆపద వస్తే.. రైతు భీమా ద్వారా ఆ కుటుంబానికి ఆదుకున్న కెసిఆర్ సర్కార్అన్నారు.మిషన్ భగీరథ ద్వారా.. తాగు నీటి గోస తీర్చి అపర భగీరతుడీగా నిల్చిన కెసిఆర్ రైతులను ఆదుకున్న విధానాన్ని చూసి.. సీఎం కెసిఆర్ గారిని ప్రశంసించిన.. రైతు నాయకుడు రాకేష్ టికాయత్ మిషన్ కాకతీయ ద్వారా 46వేలకు పైగా చెరువుల సంరక్షణ చేసి.. జల విప్లవం సృష్టించిన కెసిఆర్ అన్నారు.కెసిఆర్ పాలనలో..తెలంగాణ లో ఉన్న నీటి సంరక్షణ విధానాలను చూసి ప్రశంసించిన.. వాటర్ మ్యాన్ అఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గురుకులాల ద్వారా సబ్బండ వర్గాల పిల్లలకు.. కార్పొరేట్ స్థాయి లో విద్యను అందిస్తున్న ఘనత కెసిఆర్ గారిది అన్నారు.ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త..ఈ ఇరవై రోజులు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేయాలని తెలిపారుప్రతి బిఆర్ఎస్ కార్యకర్తప్రజల లొకి వెళ్లి.. అభివృద్ధి వివరించాలి,మంచి మనసున్న రామ్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతుప్రతి గడపకు సంక్షేమమం.. అదే మా విజయంఆసరా లాంటి పథకాలతో.. వృద్ధులను, దివ్యంగులు ఆదుకున్న ఘనత కెసిఆర్ గారిదిరైతంగానికి సాగు కష్టాలు తీర్చి.. రైతుల మోములో ఆనందం చూసిన ఘనత కెసిఆర్ గారిదిఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి.. తెలంగాణ నీ దేశానికి తలమానికం గా నిలబెట్టిన ఘనత కెసిఆర్ గారిదిప్రతి ఒక్క బిఆర్ఎస్ శ్రమించి..కార్ గుర్తు కి ఓటు వేసి ఆశీర్వాదం ఇవ్వాలని రామ్మోహన్ రెడ్డి గారు కోరారుఈ కార్యక్రమంలో కృష్ణ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు విజయప్ప గౌడ గారు గారు,ఎంపీపీ పూర్ణిమ వెంకట్ రెడ్డి గారు, జడ్పీటీసీ అంజన్నమ్మశివరాజ్ పాటిల్ గారు ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, అశోక్ గౌడ్ గారు, పెద్ద ఎత్తున సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శివప్ప , ఎంపీటీసీ లు, సర్పంచ్ లు పార్టీ ప్రజాప్రతినిధులు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top