EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఊసరవెల్లి బాధపడింది…

ఊసరవెల్లి బాధపడింది .ఈరోజు ఒక మాజీ మంత్రిని తన ఇంటిపేరు ఊసరవెల్లిగా మార్చుకుంటే పేరు   తగినట్లు  అర్థ వంతంగా ఉంటుందని ఒక పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల ప్రచార  నేపథ్యం లో  జరిగిన సంఘటనే కావచ్చు కానీ నాయకులు మాట్లాడే విధానం ఎంత గా దిగజారిందో ఈ మాటలు రుజువు చేస్తున్నాయి. నిజానికి ఊసరవెల్లి ఎవరికి హాని చేయని  ఒక బల్లి జాతికి చెందిన జీవి. అది  శత్రువుల నుండి రక్షించుకోవడానికి సందర్భాన్ని బట్టి తన రంగులను మార్చుకుంటుంది తప్ప తనకు తానుగా కావాలని అలా ఎన్నడూ చేయదు. అలాంటి ఒక జీవిని ఉదాహరణగా తీసుకొని అదొక పనికిరాని జీవిగా ముద్ర వేస్తూ ఒక వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. ఎదుటివారిపై కోపం ఉండవచ్చు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ,ఇరువర్గాల మధ్య మూడవ వ్యక్తి గాని జీవి గాని రావలసిన అవసరం ఎందుకు వస్తుంది . పోల్చడం అనేది మనిషికి ఉన్న మంచి అలవాటని చెప్పాలా ? దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు .ఇదే కాదు చాలా సందర్భాల్లో వ్యక్తి దూషణలు  మనం చూస్తేనే ఉంటాం. విమర్శ ఉండాల్సిందే కానీ అది సహేతుకంగా  ఉండాలి . ఎలాంటి రుజువు లేకుండా ఆరోపణలు చేయడం ,దాంతో పబ్లిసిటీ  తెచ్చు కోవడం మంచి పని కాదు. వ్యక్తులకు నిక్ నేమ్ లు పెట్టడం ,వారిపై కామెంట్లు చేయడం లాంటివి ఒక విధంగా ర్యాగింగ్ లాంటివి.  రాజకీయాల్లో అన్ని నడుస్తాయి అనుకోవడం  భ్రమ.  ప్రతిదానికి సాక్ష్యం ఉంటుంది .పరువు నష్టం కింద కేసు వేసే అవకాశం ఉంటుంది. నాలుక ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం స్వేచ్ఛ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు . మనం ఒక వ్యవస్తీ కృత సమాజం లో ఉన్నాం .మనం తిడుతున్నామంటే  మనల్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు .చర్య కు  ప్రతి చర్య ఉంటుంది కాబట్టి వ్యక్తులు ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరి  కాదు. ఇంటి పేర్లు గోత్రాలను అనుసరించి వచ్చినవి కాబట్టి వాటిని అవహేళన చేయడం ఏ మాత్రం హర్షణీయం కాదు.

Related News

Select the Topic
Scroll to Top