ప్రతి ఏడాది వరి కోతలు పూర్తికాగానే రైతులు ధాన్యాన్ని మార్కెట్ కు తరలించడం , అమ్ముకోవడం మనకు తెలిసిన విషయమే . కానీ ప్రతిసారి రైతు అనుకున్న ఆదాయాన్ని పొందలేకపోతున్నాడు. ఒకసారి గిట్టుబాటు ధర రాకపోవడం, ఇంకోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయినట్లు అనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైనా రైతులు మాత్రం ప్రతి ఏడాది పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. పంట చేతికొచ్చే కాలానికి వడగండ్ల వానలు ఉరుము , మెరుపులతో కూడిన వర్షాలు రావడం సాధారణమే. అందుకే వర్షాలు పడకముందే వరి పంట కోతలు ముగించుకొని ధాన్యాన్ని మార్కెట్ తరలించే ప్రయత్నం చేస్తుంటారు రైతులు. అయితే ఈ టైం టేబుల్ గురించి ప్రభుత్వా ని కి కానీ వ్యాపారస్తులకు గాని పట్టింపు లేదు. ఎంత ఆలస్యం చేస్తే అంత తక్కువ ధరలో ధాన్యం కొనవచ్చు అన్న వ్యాపారుల ఆలోచన అయితే తక్కువ గిట్టుబాటు ధరతో ధాన్యాన్ని సేకరించవచ్చని ప్రభుత్వాల ఆలోచన . ఇదంతా మన కళ్ళముందు జరుగుతున్న విషయమే .దీనికి ఒక పరిష్కారం అంటూ లేదు ,ముందస్తు చర్యలు లేవు ప్రీ ప్లానింగ్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమకు గిట్టుబాటు ధర లభించక సమయానికి అమ్ముడుపోక అసహనంతో రోడ్లపైకి రావడం ధర్నాలు చేయడం మనందరికీ తెలిసిందే . దీనిని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఎన్నడు కనిపించదు . రైతు తాను పంట పండించవద్దని గట్టి నిర్ణయం తీసుకుంటే ..సమస్య మనందరి కే .. పెరిగిన రేటుతో ధాన్యం బ్లాక్ మార్కెట్ కి తరలి వెళ్ళిపోతుంది. బియ్యం రేటు రెండింతలవుతుంది .ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం .ఒక్కసారి ఆలోచించండి .ఇది కొత్త విషయము కాదు అద్భుతమైన విషయము కాదు ఇది ఒక సామాజిక సమస్య . దీనికి పరిష్కారం ప్రజల చేతుల్లోనే ఉంది.కాబట్టి రైతుల దగ్గరికి వెళ్లి నేరుగా బియ్యం కొనుక్కోండి.మాల్స్ కి బియ్యం దుకాణాలకు వెళ్లాల్సిన పనిలేదు . వినియోగదారులు దళారీ లేకుండా నేరుగా ఉత్పత్తిదారుల దగ్గరికి వెళ్తే మంచి నాణ్యమైనవి లభించడమే కాదు మార్కెట్ రేటు కన్నా తక్కువలో వారు మీకు ఇవ్వగలుగుతారు .బియ్యం కావాలంటే రైతు ఇంటికి వెళ్ళండి. రైస్ మిల్లుల దగ్గరికి కాదు గ్రామాల్లో ఉండే పిండి మర దగ్గరకు వెళ్ళండి. అక్కడ మీకు సింగిల్ కో టు రైస్ లభిస్తుంది . అది మీ ఆరోగ్యానికి మంచిది కూడా.















