EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబర్పేట్ లో హోరుగా కాలేరు వెంకటేష్ ప్రచారం

ఐదు సంవత్సరాల నుండి అంబర్పేట అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన తనను మరోసారి గెలిపించాలని అంబర్పేట శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లో వీరన్న గుట్ట నుండి గోవింద్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అదేవిధంగా నల్లకుంట డివిజన్ వినయ్ నగర్ కాచిగూడ డివిజన్ బద్రుక కాలేజ్ వద్ద వివిధ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఐదు సంవత్సరాల నుండి అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన తనకు ప్రజల నుండి విశేష స్పందన కనిపిస్తోందని నియోజకవర్గంలో ఎక్కడికి ఈ ప్రచార యాత్ర వెళ్లిన ప్రజలే తాము చేయి పట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారని ప్రజాస్వందనం చూస్తుంటే మరోసారి కచ్చితంగా మంచి మెజార్టీతో గెలుపొందుతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బి ఆర్ ఎస్ కు హ్యాట్రిక్ విజయం తద్యమని వారి నాయకత్వంలో మునుముందు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన అంబర్పేట ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాస్, భూపతి లక్ష్మణ్, ఆర్కే బాబు, రెడ్డపాక రాము, నర్సింగ్ రావు, సురేష్, లింగం గౌడ్, బుచ్చిరెడ్డి, కన్నా , దేవేందర్ పోత్నాక్ శ్రీనివాస్,పోత్నక్ సంతోష్, వంజరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top