అంబర్ పేట నవంబర్ (ఈతరం ఇండియా న్యూస్); నియోజకవర్గం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ(ఐపీసి) ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి వాసుదేవరావు బరిలో నిలిచారు.సోమవారం అంబర్ పెట్ పార్టీ కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ మాతృ ప్రేమ పరిపాలన అందించడం కోసం ప్రజల వద్దకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ వెళుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో అవినీతి టిఆర్ఎస్ పాలను అంతం చేయాలనీ వాసుదేవరావు పిలుపు నిచ్చారు. బిజెపి, మజిలీస్, బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని ప్రజా సమస్యలను పట్టించుకోవడం లో విపలమైనాయని విమర్శించారు.గోసంరక్షణ ,మద్యపాన నిషేధం కోసం తమపార్టీ కట్టుబడి ఉందని అన్నారు. టిఆర్ఎస్ పాలన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేసిందని సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితిని కల్పించిందన్నారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని, నాకు ఓటు వేసి గెలిపించాలని వాసుదేవ రావు విజ్ఞప్తి చేసారు
















