హైదరాబాద్ ఏప్రిల్ 14 (ఈతరం భారతం న్యూ స్);రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి పురస్కరించుకొని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆద్వర్యం లో హైదరాబాద్ నల్లకుంట అంబేద్కర్ శతాబ్ది భవన్ లో మరియు హిమాయత్ నగర్ ట్యాంకబండ్ లో ముఖ్యఅతిథిగా హాజరై డా.బీఆర్ అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ డబ్బు, అధికారం ,కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబెడ్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి.రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. పార్టీలు పేద ,బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో రాజనీతి దార్శనికుడు,బడుగుల ఆశాజ్యోతి, బహుజనుల దేవుడు బాబాసాహేబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ,ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అన్నారు.గణేష్ శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సింగ్ గౌడ్ సీనియర్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.















