EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబేద్క‌ర్ యూనివర్సిటీ అడ్మీషన్ల గ‌డ‌వు పెంపు 

సికింద్రాబాద్, ఫిబ్ర‌వ‌రి 1(ఈ బీ న్యూస్): డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ యూజీ (డిగ్రీ), పీజీ కోర్సుల‌లో చేరేందుకు గ‌డ‌వును ఈ నెల 16 వ‌ర‌కు పెంచిన‌ట్టు సికింద్రాబాద్ పీజీ క‌ళాశాల అధ్య‌య‌న కేంద్రం అకాడ‌మిక్ కోఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ ఎస్ ర‌వి గురువారం తెలిపారు. 2023-2024 విద్యాసంవ‌త్స‌రానికి గాను అభ్య‌ర్థులు అడ్మీష‌న్లు పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. అభ్య‌ర్థులు పొడ‌గించిన గ‌డ‌వు తేదీని దృష్టిలో ఉంచుకొని ఆయా కోర్సుల్లో అడ్మీష‌న్లు పొందాల‌ని ఆయ‌న కోరారు. ఈ అవ‌కాశాన్ని అభ్య‌ర్థులు వినియోగించుకోవాల‌ని డాక్ట‌ర్ ర‌వి సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top