మహబూబ్ నగర్ ఫిబ్రవరి 13 (ఈ బీ న్యూ స్);అడిగితే వచ్చేది శూన్యం పోరాడితేనే రాజ్యాధికారం గోడపత్రికను హన్వాడ మండల తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో బూర్గుపల్లి కృష్ణయాదవ్ మాట్లాడు తూ మహబూబ్ న గర్ పార్లమెంటులో 65 శాతం పైగా బీసీఓటర్లు ఉన్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే పార్లమెంట్ టికెట్లు కేటాయించాలనిడిమాండ్ చేశారు. 75 సంవత్సరాలుగా రాజకీయ అణచివేతకు గురవుతున్న బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా అగ్రకుల నాయకులు కుట్ర పన్నుతున్నారని ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారికి బీసీలు గుర్తుకు వస్తారు తప్ప, వారి బాగోగులు పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి వలస నాయకులు పార్లమెంటు సీటు కోసం కాచు కూర్చున్నారని, అడ్డగోలుగా మాయ మాటలు చెబితే ఓట్లు వేయడానికి ఈసారి బీసీలు సిద్ధంగా లేరని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు స్థానికులైన బీసీలకే సీట్ కేటాయించాలని, బీసీలకు సీటు కేటాయించిన పార్టీకి బీసీ సేన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీసీసేన నాయకులు నర్సిములు, రాజు, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.















