హైదరాబాద్ డిసెంబర్ 18 (ఈతరం ఇండియా న్యూ స్);అనారోగ్యాలకు అన్నిటికీ కారణం ఆహార లోపమని,ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మాణానికై కృషి చేద్దామని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపు నిచారు. నేడు ప్రతి ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు వీటి అన్నిటికీ కారణం ఆహార లోపం మంచి ఆహారం తినక అందరూ వ్యాధుల పాలవుతున్నారు గో ఆధారిత వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో రైతులు చేస్తే ఆ పంటలు తిన్న సమాజము ఆరోగ్యవంతులవుతారు ఆహారముతోనే ఆరోగ్యముంటుంది సమాజం మంచి గా ఆరోగ్యకరంగా ఉండాలంటే రైతు మీదనే ఆధారపడి ఉందన్నారు. రైతు కూడా రసాయనికేరులు వాడకుండా గో ఆధార్ తో వ్యవసాయం చేస్తే ఆవు సుఖపడుతుంది ఆవు ద్వారా భూమి కూడా సారవంతమై జీవం పొంది మంచి పంటలు పండుతాయి అని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పేర్కొన్నారు ఇప్పుడైనా ఇప్పుడైనా ప్రతి ఒక్కరూ రైతు పైన వ్యవసాయంపై దృష్టి పెట్టి రైతుతో లాభదాయకమైన ఆరోగ్యకరమైన పంటలు పండించి పేదరిక నిర్మూలన చేయాలని కొమ్మ ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు
















