11.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల ఖమ్మం, ఈతరం భారతం.
ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రెండు సార్లు ఎంపీ అయిన నామ నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా నేతలతో ఎంతో అనుబంధం ఉంది. మొదట తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్ టి రామారావు అంటే ఎంతో ఇష్టపడే నామ, అన్న ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయ రంగప్రవేశం తెలుగుదేశం పార్టీతో చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేయడమే లక్ష్యంగా నాడు ఖమ్మం ఎంపీగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఖమ్మంతోపాటు తెలంగాణ కోసం విశిష్ఠ సేవలందించారు.
ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కోసం నామ ఆరాటం
నాడు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో నామకు ఏర్పడిన సన్నిహిత అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పోరాడిన నామ, ఖమ్మం జిల్లాలోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో ఎన్టీఆర్ ప్రారంభించిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యుడిగా పేద రోగులకు, ఖమ్మం ప్రజలకు సేవలందించి టీడీపీ క్యాడరులో చెరిగిపోని ముద్ర వేశారు. ఎన్టీఆర్ అంటే ప్రేమతోనే నామ ఇప్పటికీ టీడీపీ క్యాడర్ అంటే ఎంతో ప్రాధాన్యమిచ్చి పనులు చేస్తుంటారు. పార్టీలకు అతీతంగా విశిష్ఠ సేవలందిస్తున్న మన నామ నాగేశ్వరరావు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మద్ధతు ఇస్తామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నామ
తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంను గురువారం సాయంత్రం మధిర లోని ఆయన నివాసం లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం బీ.ఆర్.ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని డా. వాసిరెడ్డి రామనాథం ను నామ కోరారు అలానే టీడీపీ పార్టీతో ఉన్న జ్ఞాపకాలను ఆయన అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు.
నామను సత్కరించిన టీడీపీ నేతలు
అనంతరం ఎంపీ నామ ను డా వాసిరెడ్డి రామనాథం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరి జీవన్ కుమార్, టీడీపీ మధిర మండల, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మర్నీడి పుల్లారావు, మల్లాది హనుమంతురావు, రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వరరావు, వాసిరెడ్డి ఉపేందర్, వినుకొండ కృష్ణమూర్తి, ఐటీడీపీ నాయకులు వేమూరి సునీల్, వేల్పుల కొండ, మైనీడి జగన్, వట్టికొండ నాగేశ్వరరావు, పాశం రామనాథం, యడవల్లి నాగభూషణం, చట్టు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
సామాజిక సేవల నుంచి రాజకీయాల్లోకి…
పారిశ్రామికవేత్తగా వేలాదిమందికి ఉపాధి కల్పించిన నామ నాగేశ్వరరావు తన ఖమ్మం జిల్లా ప్రజలకు సేవలందించాలనే ఉన్నతాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఖమ్మం జిల్లా ప్రజలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా మంచినీరందించడం, పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేయడం, వికలాంగులను ఆదుకోవడమే లక్ష్యంగా తన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన తండ్రి నామ ముత్తయ్య ట్రస్టును ఏర్పాటు చేసి తన సొంత డబ్బులో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.















