హైదరాబాద్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్);అన్ని రంగాల అభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన కెసిఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అంబర్పేట టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.బుదవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగుడా జైన మందిరంలో పూజలు నిర్వహించి, అక్కడ నుండి వెంకట రమణ థియేటర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతాల్లో, ప్రజల మధ్య ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహిస్తూ, స్థానిక అపార్టుమెంట్ల వారిని కుడా కలిసారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి కృషి చేస్తూ అనేక రకాలుగా మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ను బలపర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాచిగుడా డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు భీష్మ దేవ్ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
















