హైదరాబాద్ మే 7 (ఈతరం భారతం న్యూస్);ప్రముఖ సామాజిక, రాజకీయ ఉద్యమ నేత ‘భారత సుదర్శన్’ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఓటర్లను, ప్రజలను నేరుగా కలుస్తూ.. ఒక సామాన్యుడిగా ఎంపీ గా పోటీ చేస్తున్నానని, ఆశీర్వదించి ఓట్లేయాలని వారిని కోరుతున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. బడా భూస్వాములు గెలిపిస్తే వారి స్వలాభం చూసుకుంటారని, సామాన్యుల ప్రతినిధి అయిన నన్ను గెలిపిస్తే ప్రతి క్షణం ప్రజల మధ్యనే ఉంటానన్నారు. అవినీతిపరులు, భూకబ్జాకోరులు, సెటిల్మెంట్లు చేసేవారిని ఓట్లేసి మన గొయ్యిని మనమే తవ్వుకోవద్దన్నారు.పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిన ఉద్యమ నేతనన్నారు. తన ‘గాజులు’ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని భారత సుదర్శన్ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో శ్రీనివాస్, ప్రకాష్, వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.















