పోచంపల్లి నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ ); హైదరాబాదుకు అత్యంత సమీపంలో ఉన్న భువనగిరి నియోజకవర్గంలో ప్రతి పల్లె ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉండగా, అసమర్ధ ఎమ్మెల్యేతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని భువనగిరి బిజెపి అభ్యర్థి, గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పోచంపల్లి కప్రాయపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూసి కాలుష్యంతో భువనగిరి నియోజకవర్గంలో పల్లెలన్నీ కాలుష్య కాసారాలుగా మిగిలిపోతున్నాయని ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని అయినా అన్నారు. తనకు భువనగిరి శాసన సభ్యుడిగా అవకాశం ఇస్తే మూసి కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా ఐటీ పరిశ్రమలను ఇక్కడికి తరలి వచ్చే విధంగా తనము తాను నిరంతరం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి విద్యార్థి యువతకు మంచి భవిష్యత్తు కల్పించడానికి సమాజంలో అన్ని వర్గాలకు మంచి భరోసా ఇన్ని ఇవ్వడానికి బిజెపిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి మండల బిజెపి నాయకులు కాప్రాయిపల్లి గ్రామ బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు
















