EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం

28.3.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ మరియు పల్నాడు జిల్లాల అధికారులతో నిర్వహించిన అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు – 2024 ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బుధవారం(28.32024) నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ , పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి IPS , సూర్య పేట జిల్లా S.వెంకట్రావు IAS మరియు జిల్లా ఎస్పీ శ్రీ బీజే రాహుల్ హగ్డే IPS , నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐపీఎస్ మరియు మూడు జిల్లాల పోలీస్ అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలు భద్రత అంశాల గురించి చర్చించారు .అంతర్ జిల్లా,అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, అక్రమ మద్యం ,మరియు ఇతర వస్తువులు రవాణా జరుగుకుండా ఉండే విధంగా నిరంతర నిఘాను ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి అని పల్నాడు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా చర్చించారు.

పల్నాడు జిల్లా సరిహద్దులో గల సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు రాకపోకలు సాగించే రహదారుల వెంబడి పోలీసు శాఖకు సంబంధించి తొమ్మిది చెక్పోస్టులు ,ఎక్సైజ్ శాఖకు సంబంధించి రెండు చెక్పోస్టులు అదేవిధంగా అటవీ రవాణా శాఖకు సంబంధించిన చెక్పోస్టులు ఒక్కొక్కటి ఉన్న చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించాలి.నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా తగినంతమంది సిబ్బందిని చెక్ పోస్ట్లు వద్ద నియమించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఐఏఎస్ , పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ , జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ , సూర్య పేట జిల్లా S.వెంకట్రావు IAS మరియు జిల్లా ఎస్పీబీజే రాహుల్ హగ్డే IPS , నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐపీఎస్ , పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ రామచంద్ర రావు , ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ ఖాజా మొహిద్దిన్ , గురజాల డిఎస్పి పల్లపు రాజు సిఐలు మరియు ఎస్ఐలు అలాగే నల్గొండ సూర్యాపేట జిల్లాల డిఎస్పీలు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top