ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 30,2024
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు, కవయిత్రి పత్తెం వసంత రచించిన ఆకుపచ్చని ఆశ కవితా సంపుటి కలకత్తా రాజారాం మోహన్‌రాయ్ ఫౌండేషన్ పుస్తక పథకానికి ఎంపికైంది. జాతీయ గ్రంథాలయ సంస్థ రాజారాం మోహన్ రాయ్ ఫౌండేషన్ కలకత్తా పుస్తక పథకానికి 2021-22 సంవత్సరానికి గాను వసంత కవితా సంపుటిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రజా గ్రంథాలయాల సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి లేఖను పంపించారు. ఫౌండేషన్‌కు తన సంపుటి ప్రతులను వసంత అందజేశారు. ఆకుపచ్చని ఆశ కవితా సంపుటికి రాజారాం మోహన్‌రాయ్ ఫౌండేషన్ గుర్తింపు లభించినందుకు కవయిత్రి వసంతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.















