19.02.2024కమాండ్ కంట్రోల్ సెంటర్ ఖమ్మం…బ్యూరో మధుశ్రీ(ఈబీన్యూస్).ఆటోలో మరిచిపోయిన మెడికో విద్యార్థిని సెల్ ఫోన్ను వెతికిపెట్టి….బాధితులకు అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిఐ అంజలి. సోమవారం మమత కాలేజ్ కు ఆటోలో వెళ్తున్న విద్యార్థిని సాయిప్రియ (mamatha hsptl. medico house surgeon) మమత హాస్పిటల్ వద్ద ఆటో దిగి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ ఆటో మరచిపోయినట్లు గుర్తించి ఖమ్మం ఖానాపురం హావెలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు చేసిన ఖానాపురం హావేలి పోలీసుల సూచనలతో కమాండ్ కంట్రోల్ నుండి సీసీ కెమెరాలలో వారు ప్రయణించిన ఆటోను గుర్తించి.. ఆటో డ్రైవర్ గోపి నాయక్ సంప్రదించారు. అతడు ఆటోను తనిఖీ చేయగా, సీటుపై silent mode లో వున్న ఫోన్ కనిపించడంతో కమాండ్ కంట్రోల్ సిఐ అంజలి కి అందజేశాడు. బాధితులని పిలిచి ఆటో డ్రైవర్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్ బాధితులకు అప్పగించారు.కార్యక్రమంలో సీసీ టివి టెక్నిషన్ ప్రకాష్ గాంధీ పాల్గొన్నారు.















