EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆడపడుచులందరికీ అండగా ఉంటాం రఘురాం రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ..మహిళా కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి పొంగులేటి

06.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డితో కలిసి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ నా అక్క చెల్లెళ్ల కోసం అందజేస్తున్నామని అన్నారు. బీజేపీ మతం, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. రాముడి పేరిట రాజకీయాలు మొదలెట్టిందని తెలిపారు.

రాజ్యాంగం మనకు పవిత్ర గ్రంథం..

మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుటిలయత్నం చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ముస్లిం, హిందూ, క్రైస్తవులకు మూడు పవిత్ర గ్రంథాలు ఉన్నట్లుగానే భారత ప్రజలందరికీ రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథంగా ఉందని అన్నారు. మళ్లీ గనక బీజేపీ ప్రభుత్వం వస్తే.. నియంత పాలన ఉంటుందని అన్నారు. అందరూ హస్తం గుర్తుపై ఓటేసి.. ఇక్కడ రఘురాం రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. అలాగే..భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఎంపికలో మన రఘురాం రెడ్డి పాత్ర ఉండేలా విజయం అందించాలని కోరారు.

మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన.. జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top