రామగుండం నవంబర్ 16 (ఈతరం ఇండియా న్యూస్);8ఇంక్లైన్ కాలని-: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 15,16,17,18,19 డివిజన్లో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాదయాత్ర చేస్తు ప్రజలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని,మాయ మాటలతో మోసం చేసిన బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం మనకు వచ్చిందని తెలిపారు.రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం, దాంతోపాటు 10లక్షలు ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామని అన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, పెళ్లి అయిన మహిళలకు నెలకు 2500 రూపాయలు, రేషన్ షాప్ లో 9రకాల వస్తువులు ఇస్తాము.. రైతులకు 2లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని అన్నారు.మగుండం ప్రాంతాన్ని సమస్యల గుండంగా చేసిన ఎమ్మెల్యేకు బుద్ది చెప్పాలని పేర్కొన్నారు. దోపిడి, గడిల పాలన చేస్తున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని అన్నారు.బూడిద దోపిడి, ఇసుక దోపిడి, భూముల దోపిడి, కొలువుల దోపిడి చేసిన ఎమ్మెల్యేకు బుద్ది చెప్పాలని, డివిజన్లో రోడ్లు, డైనెజీ, నీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరాని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను బానిసలు చెయ్యాలని చూస్తున్నరని ఆయన విమర్శించారు .ఈ నెల 30వ తేదిన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనకు అవకాశం ఇస్తే , రామగుండం ప్రాంతాన్ని అభివృధ్ధి చేసి చూపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

















