
ఆలేరు హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఔదార్యం…
ఈతరం భారతం ప్రతినిధి : 15.9.24. యాదాద్రి భువనగిరి జిల్లా : ఆలేరు జడ్పీ హైస్కూల్ 1991-92 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో తమతో చదువుకొని ఇటీవల మృతి చెందిన కాసులబాద హరిబాబు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. కుటుంబాన్ని అప్పటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆదుకోవాలని నిర్ణయించి ఈ సందర్భంగా 50వేల నగదు, బియ్యాన్ని అందజేశారు. కుటుంబానికి తమవంతు సహకారాన్ని అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మొరిగాడి వెంకటేశ్, సందుల సురేశ్, వుల్లోజు ఓంకార్, చిమ్మి ఆంజనేయులు, రాములు, సబ్బని సుభాష్, బండ శ్రీనివాస్, శ్రావణ్‌కుమార్, మల్లెల ఇస్తారి, వస్పరి రవి, గంటారం సతీష్‌చంద్ర, యూ శ్రీనివాస్, అంబటి వెంకటేశ్, మార్గం శ్రీను, శికిలం శ్రీనివాస్, పెండెం పరమేశ్వర్, కంసాని హన్మంతు, పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, బేతి శ్రీనివాస్, మంగళపల్లి నాగరాజు, బొమ్మ శివలింగం, ఎండి ఖాజా, కూళ్ల నర్సింహులు, జంపాల శ్రీనివాస్, బొప్పిడి యాదగిరి, పూసలోజు కృష్ణ, పొద్దుటూరి ప్రవీణ్, కమ్రొద్దీన్, సందె ఉపేందర్, ఎస్డి గోరి, ఎండి అమీర్, తునికి శేఖర్, అంజయ్య ఇక్కుర్తి, బాలరాజు, పూర్వ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.















