రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం తన కల్పించాలని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ముఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు నా రామగుండం నియోజకవర్గం పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతిపాలయ్యిందని కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల దోపిడీకి చరమగీతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.పాలకుర్తి మండలం రామారావుపల్లిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు మంగళ హారతుతో ఘన స్వాగతం పలికారు.. శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ సమక్షంలో 100మంది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీలో చేరారు..ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… ఈ ప్రాంత రైతు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందాని అన్నారు.. 25సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యలపై మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి మా ప్రాంతం అభివృద్ది కావాలి అని పోరాటం చేస్తున్ననని అన్నారు. స్థానిక శాసన సభ్యుడికి పాపం అని ఓటు వేసే మనకు పాపం తాకిందని అన్నారు.బండల వాగు నుండి ప్రతి గుంటకు నీళ్లు తీసుకోస్తానని అన్నారు. ఈ ఊరిలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా, రోడ్లను పూర్తి చేస్తా, ఊరును అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. రాష్ట్రంలో పండించిన పంటకు నష్టం జరుగుతే నష్ట పరిహారం ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆరోపించారు.. స్థానిక శాసన సభ్యుడి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం లో అభివృద్ది జరగలేదని అన్నారు. నేను అధికారంలోకి వచ్చక ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితుల డబ్బులను తిరిగి ఇప్పిస్తానని అన్నారు.25సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తున్న తనకు చేతి గుర్తుకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.