హైదరాబాద్ మే 4 (ఈతరం భారతం న్యూ స్);ఇండీ కూటిమికి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు వివిధ రకాల కేసుల్లో (ఆర్థిక నేరాలు, ఏసీబీ, మనీలాండరింగ్, పరువునష్టం దావా కేసులు శిక్షపడి జైలులో ఉన్నారు. లేదా వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు వచ్చి 18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. వీళ్లే జైలులో ఉండి బెయిల్ పొంది వచ్చిన వ్యక్తులు ప్రజలకు ఏంది గ్యారంటీ ఇచ్చేది..? వీళ్లా ప్రచారానికి వచ్చి మాట్లాడేది అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేసింది భారత రాజ్యాంగాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం గడిచిన 50 సంవత్సరాల అనుభవాల సందర్భాలను దృష్టిలో పెట్టుకుని సమీక్షించేందుకు వేసిన కమిషన్. అంతేకాని, రిజర్వేషన్ల రద్దు కోసం వేసిన కమిషన్ ఎంతమాత్రం కూడా కాదు. ఇది పార్లమెంటు ఆమోదంతో వేసిన కమిషన్. కమిషన్ తనయొక్క నివేదికలో ఎక్కడా కూడా రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పలేదు. కాని, జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయిన నేటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలేంటి..? నువ్వే పర్సనల్ బాండ్ మీద విడుదలై ప్రజలకు గ్యారంటీలు ఏంటి ఇచ్చేది..? వెంకటాచలయ్య కమిషన్ ను సరిగ్గా చదువుకో.. దేనికోసం వేశారో తెలుసుకో…!ఆ తర్వాత ప్రసంగాలకు వెళ్లు అంటూ డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ బెయిల్ మీద బయటకొచ్చి ప్రచారం చేస్తున్నారు.రాహుల్ గాంధీ మీద అనేక కేసులు ఉన్నాయి. పరువు నష్టం దావా కేసులో రెండు సంవత్సరాలు శిక్ష పడితే కోర్టు నుంచి బెయిల్ పై వచ్చి బయటతిరుగుతున్నారు.నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు.అహ్మదాబాద్ కోర్టు ఒక బెయిల్, జూల్ 4 2019లో ముంబై కోర్టు ఒక బెయిల్, నవంబర్ 2016లో భీవండి కోర్టు ఒక బెయిల్, గాంధీ నగర్, గౌహతి కోర్టు ఒక్కొక్క బెయిల్ ఇచ్చాయి. రూ.50వేల ష్యూరిటీతో సెప్టెంబర్ 2016లో సూరత్ కోర్టు ఒక బెయిల్ ఇచ్చింది. పాటియాల కోర్టులో ఒక బెయిల్ ఇచ్చింది.భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఒక మహిళ పట్ల అక్కడి నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది.ఒక పార్టీ స్టార్ క్యాంపెయినర్ మీద పరువు నష్టం కేసులు, అవినీతి కేసులు, ఏసీబీ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో బెయిల్ తీసుకొని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ప్రజలకు గ్యారంటీ ఇస్తడట. ఎంత విఢ్డూరంగా ఉందో ప్రజలు ఆలోచించాలి.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక కేసులలో బెయిల్ మీదనే తిరుగుతున్నారు.ఆ కేసులలో వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.5లక్షల బాండు మీద షూరిటీ తీసుకొని రేవంత్ రెడ్డి బయటకొచ్చారు.బెయిల్ మీద బయటికొచ్చిన వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో.. ప్రజలకు తాము గ్యారంటీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు..ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తులే ఎక్కువ ఉన్నారు.లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఒక ముఖ్యమంత్రి జైలులోనే ఉన్నారు.ఈడీ, సీబిఐ కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు బెయిల్ మీద బయటికొచ్చి ఇండీ కూటమిలో ఉన్నారు.బెయిల్ మీద ఉన్నవాళ్లు మన దేశాన్ని ఉద్దిరిస్తారా..?ఇటువంటి నేతలు ప్రచారంలో వాళ్లు మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజలు విసుక్కుంటున్నారు.రాజ్యాంగ సవరణ కోసం, దళితుల రిజర్వేషన్ల రద్దు కోసం జస్టిస్ వెంకటాచలయ్య కమీషన్ వేసాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.జస్టిస్ వెంకటాచలయ్య కమీషన్ దేనికోసం వేసారనేది రేవంత్ రెడ్డి చదివి తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు..రేవంత్ రెడ్డి మాటలు అవాస్తవం, సత్యదూరం, ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయి.50 సంవత్సారాల రాజ్యాంగ అమలుకు సంబంధించిన వ్యవహారంలో వచ్చిన అనుభవాల దృష్ట్యా మరింత సమర్ధవంతంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే తీసుకోవల్సిన చర్యల మీద జస్టిస్ వెంకటాచలయ్య కమీషన్ వేసారు.10 రకాల అంశాల మీద అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. అందులో ఎక్కడా కూడా రిజర్వేషన్లను తొలగించాలని లేదు.బెయిల్ మీద బయట తిరుగుతున్న రాహుల్, రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.ఇండీ కూటమి తరఫున ప్రచారం చేస్తున్న నాయకులందరూ జైలుకెళ్లిన వారే, బెయిల్ మీద తిరుగుతున్నవారే నని అన్నారు.















