EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇరిగేషన్ చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్ ఫిబ్రవరి 11 (ఈ బీ న్యూస్ );: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు(సోమవారం) అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. ఈనెల13వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌ను రేవంత్, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనపై సీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top