EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఈవీఎం మెషిన్లకు పోలీసులు సంపూర్ణ రక్షణ కల్పించాలి

ఈవీఎం మెషిన్లకు పోలీసులు సంపూర్ణ రక్షణ కల్పించాలని సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30న జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పోలీస్ స్టేషన్లో ఈవీఎం మిషన్లకు సీసీటీవీ కెమెరా మరియు సాటిలైట్ న్యూస్ ఛానల్ ల పర్యవేక్షణకు సహకరించే విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి పత్రాలను అందజేశారు. ఇట్టి విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు ఈవీఎం మెషిన్లకు సంపూర్ణ భద్రత కలిగించే విధంగా మెదలాలని విజ్ఞప్తి చేశారు. సదాశివపేట పట్టణం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి విజ్ఞప్తి పత్రం అందజేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ ఉదయ్ కుమార్ నేత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్, సదాశివపేట మండల బీసీ నాయకులు జావిద్, రాములు మరియు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top