EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఈ నెల 17వ తేదీన జ‌ర‌గాల్సిన జెన్‌కో రాత ప‌రీక్ష‌లు వాయిదా

 

హైద‌రాబాద్ డిసెంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్ );: ఈ నెల 17వ తేదీన జ‌ర‌గాల్సిన జెన్‌కో రాత ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అదే రోజు ఇత‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నందున జెన్‌కో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు జెన్‌కో ప్ర‌క‌టించింది. కొత్త తేదీల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ జెన్‌కో తెలిపింది.తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 17న పరీక్ష నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ వాయిదా ప‌డింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నా

Related News

Select the Topic
Scroll to Top