EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉచితంగా బోన్ మ్యారో చికిత్స చేయిస్తాం వికాస తరంగిణి బాధ్యులు పొలాస్ శ్రీనివాసరావు – సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల ఖమ్మం.

తలసేమియా తో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా బోన్ మ్యారో చికిత్స చేయిస్తామని వికాస తరంగిణి బాధ్యులు పొలాస్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం లోని సంస్థ కార్యాలయం వద్ద చిన్నారులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలసేమియా చిన్నారుల కోసం 14 ఏళ్ళకు పైగా నిరంతరాయంగా సేవలందిస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమైనవని అన్నారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఇక నుండి ప్రతి సంవత్సరం ఒక చిన్నారికి బోన్ మ్యారో చికిత్స ఉచితంగా చెపిస్తామన్నారు. డే కేర్ సెంటర్ లో రక్తం ఎక్కించుకునే చిన్నారులకు అన్నదానం చేస్తామన్నారు. వైద్యులు జితేందర్, నారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. హెచ్.బి 9 శాతం ఉండేలా చూసుకోవాలి అన్నారు. వేసవిలో చిన్నారులకు రక్తం అందడం లేదని, దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి ప్రొద్దుటూరి రవిచందర్, సంస్థ సభ్యులు పి.అనిత, వికాస తరంగిణి బాధ్యులు శాంతి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top