హైదరాబాద్ ఏప్రిల్ 6 (ఈతరం భారతం న్యూ స్);ఉప్పల్ పీర్జాదిగూడ మునిసిపల్ పరిధి లోని రామకృష్ణ నగర్ కాలనీలో గత కొన్ని నెలలుగా అసాధారణ రీతిలో దోమల బెడద తో ప్రజలు ఇబ్బందులకు గురి కావడమే రోగాలబారిన పడుతున్నారని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ వైస్ చైర్మన్ వి. సునీత గౌడ్ పేర్కొన్నారు. రామకృష్ణ నగర్ కాలనీలో గత కొన్ని నెలలుగా అసాధారణంగా అధిక సంఖ్యలో దోమలు రావడంతో లక్షలాది మంది నివాసితులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.రుతుపవన నెలల ముందు దోమలు ఒక సాధారణ దృగ్విషయం అయితే, వాటి సాంద్రత అసాధారణంగా పెరగడం వల్ల చాలా మంది పౌరులు మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా వంటి వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి ఆందోళన చెందుతున్నారు.పేరుకే పీర్జాదిగూడ ఉత్తమ మునిసిపాలిటి అని పేర్కొనడం తప్పఅది మొత్తం దోమల మునిసిపలిటిగా మారిందని విమర్శించారు.దోమల నివారణ కోసం మునిసిపల్ అధికారులకు,మునిసిపల్ మేయర్, స్థానిక కార్పొరేటర్, ఎంఎల్ఏలకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకొనే పాపాన పోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. దోమలనివారణ కోసం ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవ్వాలని సునీతా గౌడ్ విజ్ఞప్తి చేసారు.















