మేడ్చల్ మల్కాజ్గిరి మే 4 (ఈతరం భారతం న్యూ స్);మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర ఎం.పి. అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత సుదర్శన్ ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రశాంత్ నగర్, కళ్యాణ్ నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సుదర్శన్ మాట్లాడుతూ.. మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతుండటం ఆందోళనకరమన్నారు. ఓట్లేసి గెలిపించిన తర్వాత నాయకులు పత్తా లేకుండా పోయారని, మరికొందరు కేవలం ఎన్నికల సమయాల్లోనే డబ్బు సంచులతో దిగుతున్నారన్నారు. ధనవంతులు గెలిచిన తర్వాత సామాన్యుల గురించి పట్టించుకోవడంలేదని, చట్టసభలకు తనలాంటి సామాన్యులకు ప్రజలు ఓట్లేసి గెలిపించాలన్నారు. ఉప్పల్ సమగ్రాభివృద్ధికి, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. అన్ని రంగాల్లో ఉప్పల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాననితనకు కేటాయించిన ‘గాజులు’ గుర్తుకే ఓటేసి గెలిపించాలని భారత సుదర్శన్ ప్రజలకు కోరారు. ఈ ప్రచారంలో పుల్లూరి శ్రీనివాస్, శివకోటి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
.















