EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించిన మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా వాసి, విద్యార్ది నాయకుడు గుగులోత్ లింగా నాయక్

మరిపెడ మండలం, భావోజి గూడెం గ్రామం, వెంకురం తండా కు చెందిన గుగులోతు లింగా నాయక్ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన 83వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా పొందారు. “కంపారటివ్ స్టడీ ఆఫ్ శ్రీమద్భగవద్గీత మరియు బంజారా భగవద్గీత” అనే అంశంపై డాక్టర్.వి. సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధక గ్రంథానికి గాను ఈ డాక్టరేట్ లభించింది.  

ఈ డాక్టరేట్ పట్టాను లింగా నాయక్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌,ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.దండెబోయిన రవీందర్ మరియు అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సిఈఓ పద్మశ్రీ డా. శంతను నారాయణన్ ల చేతుల మీదుగా అందుకున్నారు. 

భారతదేశం లోనే తొలిసారిగా సంస్కృతం లో బంజారా భగవద్గీత పై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన తొలి వ్యక్తిగా లింగా నాయక్ నిలిచారు. 

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంస్కృతంలో డాక్టరేట్ అందుకున్న మూడవ గిరిజన పరిశోధక విద్యార్థిగా కూడా నిలిచారు.

నిరుపేద గిరిజన బంజారా కుటుంబంలో జన్మించిన లింగా నాయక్ తల్లిదండ్రులు గుగులోతు రంగమ్మ – గుగులోతు బాల్య (స్వర్గియ) ప్రోత్సాహంతో మారుమూల తండా నుంచి ఉన్నత విద్యకు మళ్లారు. 

ఒక మారుమూల తండాలోని ఆర్థికంగా నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన లింగా నాయక్ విద్య పట్ల తనకు ఉన్న ఆసక్తితో యం.ఏ,బి.ఎడ్, పి.హెచ్డి,సెట్ పూర్తి చేసి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం లో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

అదే క్రమంలో సంస్కృత ,బంజారా సాహిత్యం పై మక్కువతో బంజారా భగవద్గీత పై పరిశోధనకు ఉపక్రమించి, పట్టుదలతో చక్కనైన పరిశోధన గ్రంథాన్ని రూపొందించి ఉస్మానియా విశ్వ విద్యాలయానికి సమర్పించారు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి జెఎసి నాయకునిగా మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో పోలీసు కేసుల పాలైన విద్యార్థులందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో చురుకుగా పాల్గొనీ తన వంతు క్రియాశీలక పాత్ర వహించారు.అదేవిధంగా సంస్కృత విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ సంస్కృత భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది యువకులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారి విద్యాప్రగతికి తోడ్పడుతున్నారు.

ఈ సందర్భంగా డాక్టరేట్ సాధించిన లింగా నాయక్ ను అభినందిస్తూ . లింగా నాయక్ కృషి ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ .చింతా గణేష్ గారు, పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ప్రిన్సిపల్ ప్రొ.రవికుమార్ గారు,సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొ. నీలకంఠం గారు,సంస్కృత శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ విద్యానంద ఆర్య గారు,డాక్టర్.రమాదేవి గారు, కృష్ణా నాయక్ చౌవణ్ గారు,సంస్కృత అధ్యాపకులు,పరిశోధక విద్యార్థులు మరియు విద్యావంతులు అభినందించారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top