EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉస్మానియా స్నాత‌కోత్స‌వంలో డాక్ట‌రేట్ అందుకున్న రాత్లావత్ కృష్ణ

 

హైద్రాబాద్, నవంబర్ 1 ( ఈత‌రం ఇండియా న్యూస్ ) : నల్లగొండ జిల్లా దేవరకొండ ప‌ట్ట‌ణానికి చెందిన రాత్లావత్ కృష్ణ హైద్రాబాద్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం 83వ స్నాత‌కోత్స‌వంలో డాక్ట‌రేట్ డిగ్రీని అందుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వ‌హించిన స్నాత‌కోత్స‌వానికి విశ్వ‌విద్యాల‌య ఛాన్స‌ల‌ర్, తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మ‌ళ‌సై సౌంద‌రరాజ‌న్ హాజ‌ర‌య్యారు. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, అమెరికాలోని అడోబ్ సీఈఓ శంత‌ను నారాయ‌ణ్, యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ డి. ర‌వీంద‌ర్ చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌రేట్ డిగ్రీని కృష్ణ స్వీక‌రించారు. ప్రొఫెసర్ ఎ. నకులా రెడ్డి పర్యవేక్షణలో “రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సమ్మిళిత వృద్ధి – ఎంఎస్ఎంఇ ల ఎంపిక అంతర్ జిల్లాల విశ్లేషణ” అన్న అంశంపై పరిశోధన పూర్తిచేసి స‌మ‌ర్పించినందుకు ఈ డాక్ట‌రేట్ డిగ్రీ ఆయ‌న‌కు ల‌భించింది. దేవరకొండ ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ (ఇ హెచ్ పి), హైద్రాబాద్ నిజాం కళాశాలలో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశారు. దేవరకొండ ఎం కె ఆర్ కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకులు డాక్టర్ ఎం.నిర్మల్ రెడ్డి ప్రోత్సాహంతో పిజి,పి హెచ్ డి వరకు వెళ్లగలిగానని కృష్ణ చెప్పారు. కృష్ణ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పరిశోధన పత్రాలను సమర్పించారు. జాతీయస్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. డాక్టరేట్ డిగ్రీ పొందిన కృష్ణ ను తల్లిదండ్రుల తోపాటు ఎల్ఐసి-అభివృద్ధి అధికారి వి. లీమ్య నాయక్-కమల, విద్యావేత్తలు, పరిశోధకులు, బంధుమిత్రులు అభినందించారు..

Related News

Select the Topic
Scroll to Top