గోదావరిఖని, ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్); మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ (యంటిఆర్ఎస్ఎస్) పెద్దపెల్లి జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా మేకల తిరుమల పేరును యం టీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అశోక్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేకల తిరుమకు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనక్న్తరం యంపి అభ్యర్థిగా నియామక పత్రాన్ని మేకల తిరుమలకు అశోక్ అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ… సామాజిక చైతన్యం, సేవారంగం, అలాగే జర్నలిస్టుగా ఎన్నో రంగాల్లో మంచి గుర్తింపుని తెచ్చుకున్న మేకల తిరుమలను మా పార్టీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ లో ఉంచడం జరుగుతుందని వారికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తిరుమల మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి ఎం టిఆర్ఎస్ పార్టీలో అవకాశం ఇచ్చినందుకు, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు.. తన నియామకానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని పెద్దపల్లి ఎంపీగా అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఈదునూరి స్నూహిత్ తదితరులు పాల్గొన్నారు.















