31.3.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు,జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,బానోతు మదన్ లాల్,చంద్రావతి తదితరులతో కలిసి పాలేరు జలాశయాన్ని సందర్శించారు.రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులు,ప్రజలకు అండగా నిలిచేందుకు గాను క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాలేరు రిజర్వాయర్ నీళ్లు లేక ఎండిపోతుండడం చూసి ఆందోళన వ్యక్తం చేశారు.సాగర్ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా జలాలను వదిలి పాలేరు రిజర్వాయర్ ను నింపాలని,పంట పొలాలకు సాగు,ప్రజలకు తాగునీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు, పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రాంమూర్తి, శేఖర్ తదితర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.















