31.1.2024ఖమ్మం బ్యూరో నలు బో ల మధు లత : (ఈ బీ న్యూస్) ఇటీవల జారీ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్ హెచ్ వో గా భాధ్యతలు స్వీకరించిన ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్ కుమార్, ఖమ్మం టూ టౌన్ సిఐ బాలకృష్ణ, ఖమ్మం త్రీ టౌన్ సిఐ రమేష్, ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్ సిఐ భానుప్రకాశ్,సత్తుపల్లి సిఐ కిరణ్, సీసీయస్ సిఐ సత్యనారాయణ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు. ఈ సందర్భంగా భాధ్యతలు స్వీకరించిన సిఐలకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.















