EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపి లో ఓడిపోయే ఫస్ట్ సీటు మంత్రి ఆర్కే రోజాదే!    జబర్దస్ నటుడు కిరాక్ ఆర్పీ

హైదరాబాద్, మే 10 (ఈతరం భారతం న్యూ స్);: ఈ ఎన్నికల్లో గెలుపు కూటమిదేని.. ఓటమి వైసీపీదేని జబర్దస్ నటుడు కిరాక్ ఆర్పీ స్పష్టం చేశారు. పిఠాపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్‌కు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా కిరాక్ ఆర్పీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే కూటమి నేతలపై వైసీపీ అగ్రనేతలు పలువురు పరుష పదజాలంతో ఆరోపనలు సంధిస్తున్నారు.ఇక మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. ఆర్పీ చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఓ న్యూస్ చానెల్‌ వేదికగా కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓడిపోయే ఫస్ట్ సీటు మంత్రి ఆర్కే రోజాదేనని పేర్కొన్నారు. అయితే తాను ఏ పదవి ఆశించి.. ఈ ఎన్నికల ప్రచారం చేయడం లేదని చెప్పారు.తాను కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే ఓ మహానుభావుడు చేస్తున్న రావణకాష్టానికి భయపడి.. బాధపడి తాను కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నానని కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ కూటమి.. అవతల వాళ్లకు ఓటమి అని క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. అందులో ఎటవంటి సందేహం లేదన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. అలాగే శ్రీరెడ్డిపై కిరాక్ ఆర్పీ ఘాటుగా స్పందించారు

.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top