ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా కంభంపాటి
13.09.2024 ఈతరం భారతం.రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ కంభంపాటి నారాయణరావు ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక ఐఎంఏ కార్యాలయంలో ఐఎంఏ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జగదీష్ బాబుబాబు, కోశాధికారిగా డాక్టర్ గుబ్బల స్వబ్నను, ఎలెక్ట్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రెహనా బేగంను సమావేశం ఎన్నుకొన్నది.















