విజయనగరం సెప్టెంబర్ 21 (ఈతరం భారతం); ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్ఏ) విజయనగరం జిల్లా సివిల్ రైట్స్ చైర్మన్ గా సారిపల్లి బాలానంద సురేష్ కుమార్ నియమితులయినారు. ఈ మేరకు IHRA సౌత్ ఇండియా చైర్మన్ షేఖ్ ఇబ్రహీం పటేల్ నియామక ఉత్తర్వులు జారి చేసారు. నేటి నుండి జిల్లా లో బాధ్యతలు నిర్వహించాలని S.B.సురేష్ కుమార్ ను కోరారు.ఈ సందర్బంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ తనపై గల నమ్మకం తో తనకు విజయనగరం జిల్లా బాద్యతలు అప్పగించినడులకు షేఖ్ ఇబ్రహీం పటేల్ కు అందుకు సహకరించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడుకు కు ధన్యవాదాలు తెలిపారు.నేటినుండి విజయనగరం జిల్లా సివిల్ రైట్స్ చైర్మన్ గా తనవంతు భాద్యతలు నిర్వహిస్తూ సమాజం లో ప్రజలకు జరుగుతున్నా అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి సరైన న్యాయం జరిగే విదంగా కృషి చేస్తానన్నారు.















