EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

భువనగిరినియోజకవర్గఅభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమవుతుందని, ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో ఏమిటో చేసి చూపెడతామని బిజెపి అభ్యర్థి కూడా గూడూరు నారాయణరెడ్డిఅన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగాఈ రోజు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో భువనగిరి బి జె పి ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలతో ర్యాలీ గా వెళ్లి బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పైళ్ళ శేఖర్ రెడ్డి అసమర్థత వల్ల భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందడంలో కుంటుపడిందని, హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన భువనగిరి నియోజకవర్గం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత పెరిగిందని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయినప్పటికీ శేఖర్ రెడ్డి భువనగిరికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలనీ తేలేకపోవడం అసమర్థ పాలన కు నిదర్శనమని,పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన భువనగిరిలో ఐటీ మరియు ఇతర పరిశ్రమలు రాకపోవడానికి పదేళ్లుగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ప్రజా సమస్యలపై మౌనం వహించడమేనని, ఇసుక , గుట్టలను కబ్జా చేసి స్వలాభం చుసాడే తప్పా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని,శేఖర్ రెడ్డి కి ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. బస్వా పూర్ గ్రామ ప్రజలు తమ ఓటు ద్వారా ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నిరుద్యోగులకు ఉపాధి కలిగేలా ఇక్కడికి ఐటీ హబ్ ఏర్పాటు చేసి 30వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని తద్వారా అక్కడ ఇంకా ఇతర సేవలకు 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నెల లోపల గ్రామానికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయిస్తానని, భువనగిరి కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్వంత నిధులతో నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేయిస్తానని, ట్రిబుల్ ఆర్ లో సన్న చిన్నకారు రైతులకు అన్యాయం జరిగిందని వారికి న్యాయం జరిగేలా చూస్తానని, బీ ఎన్ తిమ్మాపూర్ గ్రామస్థులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాటురి అనిల్, కడారి వెంకటేష్, ఉడుత చంటి బాబు, దూసరి మహేష్, దుర్గపతి శ్రీను, శ్రీకాంత్, మచ్చ విష్ణు,మచ్చ శివకుమార్,పులి స్వామి, ఉడుత గణేష్,పులి ప్రదీప్, పులి సాయి బాబు, దుసరి గణేష్, ఇండ్ల మహేష్, రాసాల శివలింగయ్య, రాసాల వీరకుమార్, మాటురి సాయి, ఉడుత భార్గవ్, అరుముళ్ళ ఆంజనేయులు, నరాల మల్లేష్, కావడి నూతన్, రాసాలా శ్రీకాంత్, మచ్చ రమేష్, రాసాల రామ్, రాసాల నవీన్, తుమ్మల భాను, రాసాల శ్రీకాంత్, మచ్చ వెంకటయ్య, మాటూరి అరుణ్ కుమార్, ఉడుత బాలస్వామి, ఉడుత కిరణ్, డుసరి కిరణ్, దూసరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top