హైదరాబాద్ నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ );: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఓదార్చే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులను ఓదారుస్తున్నారు. బీజేపీని వీడొద్దు.. భవిష్యత్తు ఉంటోందని భరోసా కల్పిస్తున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు బీజేపీ నేతలు దేశ్ పాండే, గడీల శ్రీకాంత్ గౌడ్ ఇళ్లకు వెళ్లి ఓదార్చారు. దేశ్ పాండేకు సంగారెడ్డి టికెట్ ఇచ్చి బీఫామ్‌ను పులిమామిడి రాజుకు బీజేపీ ఇచ్చింది. దీంతో సంగారెడ్డి బీజేపీ నేత దేశ్ పాండే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పటాన్చెరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పరిస్థితి కూడా అలానే అయింది. దీంతో ఆ ఇద్దరి నేతలను బండి సంజయ్ ఓదార్చారు. భవిష్యత్ ఉంటుందని హామీ కల్పించారు.
















