కజ్జి కాయలు
కావలసినవి:
• మైదా: 250 గ్రా
• బుడ్డపప్పులు: 100 గ్రా
• బెల్లం: 75 గ్రా (తురిమినది)
• ఎలైచి :10
• నెయ్యి: 15 గ్రా
• నూనె: 80 గ్రా
విధానం:
మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తగా నూనె వేసి పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బుడ్డపప్పులను వేయించివాటిని వలుచుకొని పొడి చేసుకోవాలి, వాటికీ తురిమిన బెల్లం కలపాలి.తర్వాత శనగపిండి-బెల్లం మిశ్రమంలో ఏలకులు మరియు నెయ్యి వేసుకోండి.. తాయారు చేసుకొని పెట్టుకుని పిండినీ నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోండి. ఉండలుగా చేసుకున్న ప్రతి బంతిని పూరీలా చదును చేయండి.కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకవైపు ఉంచి హాఫ్ మూన్ షేప్ లో మడుచుకొని బంగారు రంగు వచ్చేవరకు నూనెలో వేయించాలి.కొన్ని నిమిషాలు చల్లబరచండి. ఇక కరకరలాడే కజ్జి కాయలు సిద్ధం.
– వి హెచ్ సురేష్















