EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కడియం కు టికెట్‌ ఇప్పించిందే నేనే.. ఓడగొట్టేది కూడా నేనే!  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు   

ఈతరం భారతం న్యూస్ ;: బీఆర్ఎస్‌ను వీడిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైర్‌ అయ్యారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించింది తనేనని, మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా నేనేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహ‌రికి ఏం త‌క్కువ చేయ‌లేదు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశాలు ఇచ్చింది పార్టీ.ఆయన పదవులు రావడం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లి లాంటి పార్టీకి బిడ్డ కోసం తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికల్లో కడియం గెలుపునకు కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశ వాదులకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top