EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కదిలొచ్చిన ఖమ్మం

11.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం

ఎటు చూసినా జనమే.. కదన ఉత్సాహంతో కదిలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులమయమే. మేమున్నాం.. మీ భారీ విజయంలో బాసటగా నిలుస్తాం అంటూ.. చేయి.. చేయి కలిపిన కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఖమ్మం.. జన గుమ్మ మై శనివారం పులకించింది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ.. వందలాది బైకులతో.. ఆయా పార్టీల జెండాలను రెపరెపలాడిస్తూ చేపట్టిన ర్యాలీ కొత్త ఊపు నింపింది.

ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి మొదలై ఎన్టీఆర్ సర్కిల్ వరకు..

నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ ఆర్ కళాశాల ఎదుట ప్రధాన రహదారిపై ఈ బైక్ ర్యాలీ శనివారం సాయంత్రం ఆరంభమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి హాజరై లాంఛనంగా ప్రారంభించారు. రెట్టించిన ఉత్సాహంతో వందలాది బైకులు.. రయ్ న ముందుకు దూసుకుపోతుండగా.. శ్రేణులు కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రదర్శన ఇల్లెందు క్రాస్ రోడ్, వీఆర్ కే సిల్క్స్, మమత మార్గం, చెరువు బజార్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస నగర్, వ్యవసాయ మార్కెట్, పీఎస్ఆర్ మార్గ్, కాల్వొడ్డు, మయూరి సెంటర్, బస్ డిపో, రాపర్తి నగర్ మీదుగా సాగి.. ఎన్టీఆర్ సర్కిల్లో ముగిసింది. ఎన్నికల నియమావళిని పాటిస్తూ.. నిర్దేశించిన సమయంలోపు విజయవంతం చేశారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మంత్రులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్, వామపక్ష, టీడీపీ నాయకులు అందరికీ అభివాదం చేస్తూ.. మరింత ఉత్సాహం నింపారు.

రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాo.

ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామనిమంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసుకుందామని అన్నారు. ఈనెల 13వ తేదీన అందరూ బాధ్యతగా తమ తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. హస్తం గుర్తుపై ఓటేసి.. ఘన విజయాన్ని అందించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top