EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కరీంనగర్ లో విజృంభిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి

కరీంనగర్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం) మొదట దురదతో ప్రారంభమై..క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే వందల కేసులు నమోదయ్యాయి.సెల్యూలైటిస్ అనే ఈ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే.. కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతున్నది. ప్రస్తుతం మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ఇటీవల ఇండియాలోనూ ఓ మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వైరల్ ప్రజలను భయపెడుతోంది. ఈ చర్మ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది.. నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలని డాక్టర్లు చెబుతున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top