హైదరాబాద్ డిసెంబర్ 20 (ఈతరం న్యూస్ );దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వెరియంట్ JN – 1 మహమ్మారి కట్టడి పై తీసుకోవాల్సిన జాగ్రత్త లపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి Dr. మంసుఖ్ మాండవీయ అధ్వర్యంలో అన్ని రాష్ట్రాల వైద్య, అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య, అరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర సచివాలయం నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కొత్త వెరియంట్ JN – 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న మందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















