హైదరాబాద్ మార్చ్ 28 (ఈతరం భారతం న్యూ స్); కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల కష్టాలు, కన్నీళ్లను ప్రపంచానికి చాటాలని ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ కార్డినల్ బిషప్ ఆంథోని పూల పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ బిషప్ హౌస్ లో గుంటూరుకు ఎసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కనపాల జోసఫ్ తెలంగాణకు చెందిన నందిని సిధారెడ్డి కవిత్వం పరిశీలనపై రాసిన పుస్తకాన్ని బిషప్ ఆంథోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిషప్ ఆంథోని మాట్లాడుతూ, తాను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడడంతో పాటు దేవుని దయ తోడై ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. సమాజంలో రోజురోజుకు విలువలు పతనం కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాల్యం నుంచే పిల్లలకు సమాజం పట్ల వ్యవహరించాల్సిన తీరు, విలువలను బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కనపాల జోసఫ్, బిషప్ కనపాల కిరణ్ ,క్రిస్టియన్ నేత రాబర్ట్ బ్రూసీ, టీపీసీసీ నేత దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.















