EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కవులు సమాజానికి ఉపయోగపడే విధంగా రచనలు చెయాలి       ఆనందలహరి పుస్తకావిష్కరణ సభలో వక్తలు

హైదరాబాదు జనవరి 29 (ఈ బీ న్యూ స్);హైదరాబాదులోని విద్యానగర్ లో గల జాతీయ బీసీ భవన్ లో సుతారపు వెంకటనారాయణ రచించిన ఆనందలహరి పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుతారపు వెంకటనారాయణ రచించిన ఆనందలహరి పుస్తకావిష్కరణ సభ విద్యానగర్ లోని జాతీయ బీసీ భవన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనందలహరి పుస్తకాన్ని తెలంగాణ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విచ్చేసి ఉపన్యసిస్తూ సుతారపు వెంకటనారాయణ గతంలో మనసు లిపి ,కరోనా కదలికలు, అక్షర లహరి కవిత పుస్తకాలను రచించి తెలంగాణ కావులలో ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ప్రస్తుతం ఆనందలహరి గేయం సంపుటిని ఆవిష్కరించడం అభినందనీయం అన్నారు. సమాజంలోని వివిధ అంశాలను వివిధ కోణాల్లో అవగాహన చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా రచనలు చేశారని భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసే సామర్థ్యం ఉన్న కవిగా రచయితగా గుర్తింపు పొందాలన్నారు. కవులు సమాజంలోని ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ సమాజ ప్రయోజక రచనలు చేసినప్పుడే నిజమైన సార్ధకథ అన్నారు. గౌరవ అధ్యక్షులుగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కాలేశ్వరం శంకరం పుస్తకాన్ని గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కవుల సంఘం సాహిత్య కార్యదర్శి అనుమాల ప్రభాకరాచారి ,కోశాధికారి దొంతర బోయిన దైవ దీనం, మానస ఆర్ట్ సంస్థ వ్యవస్థాపకులు రఘు శ్రీ ,తెలంగాణ భాషా చైతన్య సమితి వ్యవస్థాపకులు బడేసబ్ ప్రముఖ కవులు కవయిత్రులు రామచంద్ర మౌళి పొన్నం రాజయ్య గౌడ్ తంగేళ్లపల్లి కనకాచారి కొమ్ము విజయలక్ష్మి దొడ్ల విజయ తదితరులు పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top