EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ స్థానాలను బిసిలకే కేటాయించాలి :బిసి రాజ్యాధికార సమితి డిమాండ్

హనుమకొండ ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూ స్): కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ స్థానాలను బిసిలకే కేటాయించాలని బిసి రాజ్యాధికార సమితి రాష్ట్ర అద్యక్షులు దాసు సురేశ్ డిమాండ్ చేసారు. శుక్రవారం హనుమకొండ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో దాసు సురేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సామాజిక న్యాయ అజెండా ను తెలంగాణలో ఆచరించడం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో బిసిలకు సీట్ల కేటాయింపు లో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.బీసీ దళిత ఉద్యమకారులు , ప్రజాస్వామిక శక్తులు, సివిల్ సొసైటీ మద్దతుతోనే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఈ వర్గాలను విస్మరిస్తే పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో మా తీర్పు ను వెల్లడిస్తాం..పాంచ్ న్యాయ్ పేరిట మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని విస్మరిస్తోందని విమర్శంచారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top